దేవుడి పేరు చెబితే కలెక్షన్స్ గ్యారంటీ...ఇదే ప్యాన్ ఇండియా మంత్రం..!

ఒక రీజినల్ హీరో ఫ్యాన్ ఇండియా హీరో అవ్వాలి అంటే నేషనల్ వైడ్ ఫాన్స్ ని సంపాదించుకోవాలి.అంటే దానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన కథ ఉండాలి.

 Devotional Movies Which Are In Production Karthikeya 2 Ramayan Kantara Brahmastr-TeluguStop.com

ఇక అలాంటి కథకు దేవుడు తోడైతే దాని ఫలితం మరో రేంజ్ లో ఉంటుంది.అలాంటి డివై న్ ఫలితాన్ని అందుకున్న మన సినిమా కార్తికేయ 2.( Karthikeya 2 ) కృష్ణ తత్వం తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా చిన్న హీరో అయినా నిఖిల్ ని( Nikhil ) పెద్ద హీరోగా మార్చేసింది.అందుకే ఆ తర్వాత చాలామంది ఈ డివోషనల్ కథలను ఎంచుకునే ప్రయత్నం చేశారు.

అందులో కొన్ని వర్క్ ఔట్ అయిన మరికొన్ని తుస్సుమన్నాయి.అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో దేవుడు పేరు చెప్పుకొని ఈ చిన్న హీరోలు పెద్ద హీరోలు అయిపోయారు.

అలాగే మరోసారి అలాంటి ప్రయోగాలే చేయబోతున్నారు.

Telugu Brahmastra, Devotional, Divine, Kantara, Karthikeya, Nikhil, Ramayan, Ran

నిఖిల్ కి ఫ్యాన్ ఇండియా గుర్తింపు ఇచ్చిన డివోషనల్ సబ్జెక్ట్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.స్వయంభు( Swayambhu ) అనే సినిమాతో మరోమారు తన అదృష్టాన్ని నేషనల్ వైడ్ గా పరీక్షించుకోబోతున్నాడు.అలాగే రిషబ్ శెట్టి( Rishab Shetty ) కూడా కన్నడ వారికి తప్ప మరెవరికి తెలియదు కాంతారా( Kantara ) ముందు వరకు.

కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి డివైన్ బ్లాక్ బాస్టర్ అనే పేరు సంపాదించుకొని 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.ఇందులో ఒక రీజియన్ దేవుడుని అందరూ యాక్సెప్ట్ చేశారు.

కేజిఎఫ్ సినిమా యష్ ని రాత్రికి రాత్రే స్టార్ హీరోని చేసింది.ఇప్పుడు కేజిఎఫ్ మరో భాగం కూడా రాబోతోంది.

Telugu Brahmastra, Devotional, Divine, Kantara, Karthikeya, Nikhil, Ramayan, Ran

ఇక బ్రహ్మాస్త్ర ముందు వరకు రణబీర్ కపూర్( Ranbir Kapoor ) కేవలం ఒక స్టార్ కిడ్.బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు అన్న పేరు తప్ప అంత పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు లేదు.నార్మల్ హీరోగా కొన్ని సినిమాలు తీసిన బాలీవుడ్ వరకే నడిచాయి.కేవలం సౌత్ ఇండియా కి ఆలియా భట్ భర్తగానే పరిచయం.కానీ బ్రహ్మాస్త్ర సినిమా( Brahmastra ) ద్వారా ఆయన సౌత్ ఇండియాకి పరిచయం అవడంతో పాటు ఆ తర్వాత వచ్చిన ఆనిమల్ సినిమా అతని రేంజ్ ను పెంచేసింది.ఇప్పుడు బ్రహ్మాస్త్రకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు రణబీర్ కపూర్.

దానితో పాటు మరో దేవుడి కాన్సెప్ట్ ఆయన రామాయణం( Ramayanam ) కూడా రెడీ అవుతోంది.ఇందులో కూడా రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube