Devireddy Sharada : తండ్రి రైతు.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కూతురు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఓర్పు, పట్టుదల ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.తల్లీదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా కూతురు దేవిరెడ్డి శారద( Devireddy Sharada ) ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

 Devireddy Sharada Inspirational Success Story Details Here Goes Viral In Social-TeluguStop.com

శారదకు బాల్యం నుంచి చదువు విషయంలో తల్లీదండ్రుల ప్రోత్సాహం ఉండేది.వేర్వేరు విభాగాలలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శారద నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం గ్రామానికి( Marrigudem ) చెందిన శారద ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ పూర్తి చేశారు.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో ప్రస్తుతం ఫిజిక్స్ బోధిస్తున్న శారద తాజాగా రిలీజైన గురుకుల ఉపాధ్యాయ నియామక ఉద్యోగ ఫలితాలలో పీజీటీ ఫిజికల్ సైన్స్ విభాగంలో ఏకంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం.

Telugu Devi Sharada, Devisharada, Marrigu, Nalgonda-Inspirational Storys

టీజీటీ ఫిజికల్ సైన్స్( TGT Physical Science ) విభాగంలో మూడో ర్యాంక్ సాధించారు.ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ జాబ్ కు కూడా ఆమె ఎంపిక కావడం జరిగింది.2023 సంవత్సరంలో నిర్వహించిన కేజీబీవీ ఉద్యోగాలలో పీజీసీఆర్టీసీ, సీఆర్టీలో ఆమె జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రభుత్వ కొలువులకు అర్హత సాధించడం జరిగింది.ఐదు ఉద్యోగాలకు ఎంపికైన శారద తనకు జేఎల్ జాబ్( Junior Lecturer Job ) అంటే ఇష్టమని చెబుతున్నారు.

అమ్మ కోరిక మేరకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యానని ఆమె చెబుతున్నారు.భర్త శ్రీనివాస్ రెడ్డి, తండ్రి సీతారాంరెడ్డి సహకారం కూడా మరవలేనిదని శారద పేర్కొన్నారు.

దేవిరెడ్డి శారద వెల్లడించిన విషయాలను నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.శారద లాంటి వ్యక్తులను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు( Govt Jobs ) ప్రిపేర్ అయితే సులువుగా ఉద్యోగం సాధించవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవిరెడ్డి శారద టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.శారద టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube