టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
రైతులు పండించిన పంట కొనుగోలు చేసేవారు లేక మరోపక్క పంట తీయలేక అయోమయంలో రైతులు ఉన్నారు అని అన్నారు.గతంలో టన్ను 5000 ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని.
రైతులకు సమాధానం చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి దేవినేని ఉమా ప్రశ్నలు సంధించారు.
అదే రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో పూర్తయిన టిడ్కో ఇళ్లు ఇప్పటి దాకా ఎందుకు ఇవ్వలేదు .? ప్రజలను ఎందుకు ఇబ్బందులపాలు చేస్తున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.టిడ్కో ఇళ్లు వచ్చిన ప్రజలు సొంత ఇంటి కోసం ఇంకా కలలు కంటూనే ఉండాలని ఆ స్థితిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని.
పేదలకు అన్యాయం చేస్తుందని పేదలకు వైఎస్ జగన్ ఏం సమాధానం చెబుతారు అని దేవినేని ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.
.