విజయవాడ: దేవినేని స్మిత చలసాని పండు కుమార్తె.పెనమలూరు నుండి బొడే ప్రసాద్ కి టీడీపీ నుండి టికెట్ కేటాయించారు.మాకు ఎందుకు కేటాయించలేదు?ప్రతి సారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది.2009 నుండి ఒక్క సారి అయినా సీటు ఇస్తే బాగుండేది.వెన్ను పోటు రాజకీయాలు టీడీపీ లోనే ఎందుకు ఉంటున్నాయి అర్దం కావటం లేదు.2009 లో పండు ఓడిపోవడానికి టీడీపీ పార్టీ నాయకులే కారణం.సొంత పార్టీ నాయకులే పండు ను ఓడించారు.పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారు?పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుంది.
కుటుంబం అన్నాక చిన్న చిన్న తప్పులు తప్పవు… అలానే పార్టీ లో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతాయని సర్ధుకుపోయాం.పండు చనిపోయినా మేము పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఆపలేదు.2014 లో మున్సిపల్ ఎన్నికలు కూడా భూజనా వేసుకుని పని చేశాం.గతం లో టీడీపీ టిక్కెట్లు ఇచ్చినప్పుడు కూడా మమల్ని సంప్రదించలేదు.కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీ గెలుపు కోసం రోడ్ల మీద తిరిగి పని చేశాం.2024 లో సీటు ఇవ్వాలని పలు మార్లు కోరటం జరిగింది.పండు ఆత్మ శాంతి కోసమే పని చేస్తున్నాం … పదవుల కోసం కాదు.ప్రతి గడపకు మేము తిరుగుతూనే ఉన్నాం.
ఇప్పటికీ సేవా కార్యక్రమాలు ఆపలేదు.టికెట్ ఇచ్చే ముందు అయినా మమల్ని సంప్రదిస్తే బాగుండేది.
మచ్చ లేని రాజకీయాలు చేశాం.ఇంత చేసిన మాకు .పార్టీ కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు.మాకే అన్యాయం జరుగుతుంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఎంటి.
అధిష్టానం నుండి ఎటువంటి స్పందన లేదు.నారా లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పారు.
ఐవిఆర్ఎస్ లో మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు.బోడె బ్లాక్ మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా?
.