స్టార్ హీరో అయితే అలానే చేస్తావా అంటూ దేవీ నాగవల్లిని ఆడేసుకుంటున్న నెటిజన్స్?

యాంకర్, బిగ్ బాస్ అయిన దేవి నాగవల్లి గురించి మనందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో దేవి నాగవల్లి పై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ జరుగుతుంటాయి అన్న విషయం కూడా తెలిసిందే.

 Devi Nagavalli Gets Trolling In Vishwaksen Issue Goes Viral, Devi Nagavalli, Vis-TeluguStop.com

నాగవల్లి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెపై ఉన్న నెగిటివ్ ఇమేజ్ కాస్త పోయింది పాజిటివ్ ఇమేజ్ ఏర్పడింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరింత పాజిటివిటి ఏర్పడింది.

కానీ అప్పుడప్పుడు దేవీ నాగవల్లి చేసే ఇంటర్వ్యూలు, చిన్న సెలెబ్రిటీల మీద చూపించే ప్రతాపంతో ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది.ఇలా ఉంటే తాజాగా దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ విషయంలో ప్రవర్తించిన తీరుపై కూడా ట్రోలింగ్స్ ని ఎదుర్కోటోంది.

హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా విశ్వక్ సేన్ ఒక ఫ్రాంక్ వీడియోని చేయగా ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాంటూ ఓ లెవెల్‌లో హంగామా చేసిన ఆ అభిమాని, వీడియోలో కనిపించిన విశ్వక్ సేన్, పబ్లిక్‌లో అలా న్యూసెన్స్ చేయడంతో పోలీసులకు వరకు వ్యవహారం వెళ్లింది.ఇక ఇదే విషయం పై దేవీ నాగవల్లి డిబెట్ పెట్టారు.

ఇందులో విశ్వక్ సేన్, దేవీ నాగవల్లి మధ్య మాటల యుద్దం జరిగింది.చివరకు విశ్వక్ సేన్‌ని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని కెమెరా ముందే దేవీ నాగవల్లి దురుసుగా ప్రవర్తించింది.

దేవీ నాగవల్లి ప్రవర్థన మీద నెట్టింట్లో దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.ఇది జర్నలిజమా? అని ఒకరు ప్రశ్నించగా.అది నీ స్టూడియోనా? అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు.నువ్ టీవీ9లో పని చేస్తున్నావ్.

అది నీ స్టూడియో కాదు అని మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.విశ్వక్ సేన్ స్థానంలో ఓ పెద్ద హీరోనో, పెద్ద రాజకీయ నాయకుడో ఉంటే నువ్ ఇలానే మాట్లాడుతావా? మాట్లాడగలవా? అని కామెంట్లు పెడుతున్నారు.ఏదిఏమైనప్పటికీ విశ్వక్ సేన్ ఈ విషయంలో దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుపై అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube