కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ “దేవర: పార్ట్ 1” 2024, సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది.
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ ( Chuttamalle )అప్పుడే పెద్ద హిట్ గా మారింది.అద్భుతమైన పాటలు యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ మూవీ ప్రేక్షకుల్లో హైప్స్ విపరీతంగా పెంచేసింది.
ఇందులో అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చాలామంది దృష్టిని ఆకర్షించింది.ఈ యాక్షన్ సీన్ కోసం తారక్ ముంబైకి చెందిన ఈతగాళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు.సెప్టెంబర్‌లో శంషాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బీచ్ సెట్‌లో కొన్ని సీన్లు షూట్ చేశారు.సముద్రంలోని మొత్తం సన్నివేశాల కోసం మూవీ టీమ్ ఏకంగా 35 రోజులు పాటు కష్టపడింది.
మొదట ఈ సముద్ర సన్నివేశాలను కర్ణాటక రాష్ట్రంలోని కపోలి విలేజ్‌లో చిత్రీకరిద్దామని మూవీ టీమ్ భావించింది.కానీ ఎందుకో అక్కడ షూట్ చేయడం మేకర్స్ కి సాధ్యపడలేదు.
అందుకే హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఆర్టిఫిషియల్ గా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేశారు.అందుకోసం వారు 150 /200 ట్యాంక్ తీసుకున్నారు.
ఐదు అడుగుల లోతులో నీటిని నింపారు.అలా వాటర్ సీక్వెన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
దేవర ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ మూవీ సీన్ల కోసం ప్రత్యేకంగా బోట్స్ ను తయారు చేశాడు.ఆ బోట్స్ ఎంత బాగున్నాయంటే వాటిని నిజంగానే సముద్రంలో వేసి వాటిపై ప్రయాణించవచ్చట.సముద్రం అనేది ఎప్పుడూ అలలతో అస్థిరంగా ఉంటుంది.అయితే వీరు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా అలాంటి అలలను ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు.దాని కోసం ఒక ఎక్విప్మెంట్ వాడారు.ఈ వాటర్ సీన్లు అద్భుతంగా తీయడానికి టీమంతా 35 రోజులు పాటు కష్టపడింది.
ఎన్టీఆర్( JR ntr ) కూడా శక్తి వంచన లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చాలా శ్రమ పడ్డాడు.ట్రైలర్ లో ఓ షార్క్ సీన్ ఉంటుంది కదా.దాన్ని పర్ఫెక్ట్ గా తీయడానికి ఏకంగా ఒక రోజు సమయం కేటాయించారట.ఈ సన్నివేశాలు చూడ్డానికే థియేటర్లకు వెళ్ళొచ్చని చాలామంది అంటున్నారు.
మొత్తం మీద దేవర టీం చాలా కష్టపడింది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలనే కోరుకుందాం.