ఎన్టీఆర్‌ 'దేవర 1' రిలీజ్ డేట్‌ లో మార్పుకు ఛాన్స్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr ntr ) హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) ఇదివరకే ప్రకటించాడు.ఇక ఈ సినిమా యొక్క మొదటి భాగము ను వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల లో విడుదల చేయాల్సి ఉంది.

 Devara Movie Release Date Rumor ,jr Ntr , Devara Movie , Devara Part 1, Korat-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ను వచ్చే ఏడాది వేసవి చివరి లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.అంటే జూన్ నెల లో సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

అది కూడా వీలు పడక పోతే సినిమా ను దసరా కానుకగా విడుదల చేస్తారని సమాచారం అందుతుంది.దేవర సినిమా యొక్క మొదటి భాగం విడుదల కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి హిందీ వార్ 2( War 2 ) సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది.ఇప్పటికే ఆ సినిమా కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.

అయితే దేవర సినిమా అనుకున్న టైం కి పూర్తయ్యే పరిస్థితి కనపడటం లేదు.దాంతో వార్‌ మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

ఒక వేళ వార్‌ 2 సినిమా షూటింగ్ మొదలు పెడితే మాత్రం దేవర సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.షూటింగ్ ఆలస్యం అయితే విడుదల తేదీ ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.దేవర సినిమా షూటింగ్ విషయం లో ప్రస్తుతం సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube