సీఐ నాగేశ్వర రావు వనస్థలిపురం కి చెందిన ఒక మహిళను అత్యాచారం చేసిన కేస్ లో వనస్థలిపురం ఎసిపి వివరణ ఇవ్వడం జరిగింది,ఈ నెల 8 న ఒక బాధిత మహిళ వచ్చి పిర్యాదు చేసిందని,తనని సీఐ అత్యాచారం చేసి అతని వేపన్ తో బెదిరించి కార్ లో ఆమె బర్త నీ కూడా ఎక్కించుకుని ఔట్ స్కట్ కి తీసుకుని వెళ్తుండగా కార్ ప్రమాదం గురవడం తో అక్కడ నుండి పారిపోయి వచ్చి వనస్థలిపురం లో పిర్యాదు చేసిందని,అనంతరం ఆమెని హాస్పిటల్ కి పంపించడం జరిగిందని,ఆమె నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయం లో తనపై సీఐ అత్యాచారం చేసినట్లు తెలిపిందన్నరు.
నిందితుడు సీఐ మాత్రం పరారీలో ఉన్నదని తమ అదుపులో లేడని తెలిపారు,బాధితురాలు భర్త ఒకటిన్నర సంవత్సరాల పాటు సీఐ ఫార్మ్ హౌస్ లో పనిచేశారని,అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ ని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించిన అనంతరం పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు ఎసిపి పురుషోత్తం రెడ్డి.