మణికేశ్వరి నగర్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్( Padma Rao Goud ) ఇంటింటి ప్రచారం నిర్వహించారు బస్తీ వాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది.మానికేశ్వరి నగర్ లో ఆసుపత్రి నిర్మాణం తమతో నే సాధ్యమని పద్మారావు గౌడ్ స్పష్టీకరణ చేశారు.
తన ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్ పరిధిలో మణికేశ్వరి నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ ( Secunderabad )ప్రజల సంక్షేమo కోసం నిరంతరం శ్రమించామని, మరో అవకాశం కల్పించి తనను గెలిపించాడంతో పాటు సీం ఎం కెసిఆర్ కు హ్యాట్రిక్ సాధించాడలో సహకరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో నిలుస్తున్నామని, ఎన్నో సమస్యలను పరిష్కరించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు.
ఆసుపత్రి నిర్మాణానికి కృషి మణికేశ్వరి నగర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ని( Government Hospital ) నిర్మించాలన్న స్థానికుల అభిమతాన్ని తాము గౌరవించమని, ప్రభుత్వం నుంచి అనుమతిని పొందమని తెలిపారు.స్థల సేకరణ,నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆసుపత్రిని తామే నిర్మిస్తామని స్పష్టం చేశారు.