ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతా ఏకం కావాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి పోరాడుదామన్నారు.
విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని విమర్శించారు.ప్రశ్నించిన వారిని హింసించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటారని తెలిసి కూడా ఓట్లు వేశారనిపిస్తోందని మండిపడ్డారు.
మూడున్నరేళ్లుగా ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతికేకత ఉందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తెలిసే హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







