ఉమ్మడి రాజధాని హైదరాబాద్( Hyderabad ) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.ఈ క్రమంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డికి( YV Subbareddy ) టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్( Dhulipalla Narendra Kumar ) కౌంటర్ ఇచ్చారు.
రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారని విమర్శించారు.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి( Sajjala Ramakrishna Reddy ) దొంగ ఓట్లు పెంచే బాధ్యత,
వైవీ సుబ్బారెడ్డికి రాజధానుల సంఖ్యను పెంచే బాధ్యతను అప్పగించినట్లున్నారని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికే ఉమ్మడి రాజధాని డిమాండ్ అని విమర్శలు చేశారు.రాష్ట్రంలో అమరావతిని ( Amaravati ) నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ అంటున్నారని మండిపడ్డారు.