నాలుగు కొత్త Ai ల్యాప్ టాప్ లను లాంఛ్ చేసిన డెల్.. ఫీచర్లు ఇవే..!

డెల్ సంస్థ( Dell ) భారత మార్కెట్లో AI ల్యాప్ టాప్ ల, మొబైల్ వర్క్ స్టేషన్ ల యొక్క కొత్త పోర్ట్ ఫోలియోను ప్రారంభిస్తూ, నాలుగు కొత్త ల్యాప్ టాప్ లను తీసుకొచ్చింది.ఈ ల్యాప్ టాప్ ల ధర, ఫీచర్ వివరాలను తెలుసుకుందాం.

 నాలుగు కొత్త Ai ల్యాప్ టాప్ లను-TeluguStop.com

Dell latitude 5450 ల్యాప్ టాప్

: ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.110999 గా ఉంది.ఈ ల్యాప్ టాప్ 5000 సిరీస్ లో భాగంగా లాంఛ్ అయింది.ఇంటెల్ కోర్ అల్ట్రా U-సిరీస్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.మునుపటి తరంతో పోలిస్తే 10% వరకు మెరుగైన వెబ్ బ్రౌజింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఉత్పాదకత, కంటెంట్ సృష్టి పనితీరును అందిస్తుంది.

Dell precision 5490 ల్యాప్ టాప్

: ఈ ల్యాప్ టాప్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో టచ్-ఎనేబుల్డ్ 14- అంగుళాల ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ ప్లేతో వస్తోంది.పనితీరు మెరుగుపరచడం కోసం AI-అప్డేట్ లను కలిగి ఉంది.భారత మార్కెట్లో ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.219999 గా ఉంది.

Dell latitude 7350 ల్యాప్ టాప్

:

ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.173999 గా ఉంది.ఈ ల్యాప్ టాప్ సొగసైన తేలికపాటి డిజైన్ ను కలిగి ఉంటుంది.

హానికరమైన నీలిరంగు కాంతిని తగ్గించడానికి కంఫర్ట్ వ్యూ ప్లస్ తో 3k రిజల్యూషన్ ను కలిగి ఉంది.

Dell latitude 9450 2-in-1 ల్యాప్ టాప్:

ఈ ల్యాప్ టాప్ 14- అంగుళాల ఇన్ఫినిటీ ఎడ్జ్ QHD ప్లస్ డిస్ ప్లే ను కలిగి ఉంది.జీరో- లాటిస్ కీబోర్డ్, హాప్టిక్ కోలాబరేషన్ టచ్ ప్యాడ్ కలిగి ఉండే ప్రపంచంలోనే ఏకైక బిజినెస్ ల్యాప్ టాప్ ఇదే.ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.260699 గా ఉంది.ఇది మినీ-LED బ్యాక్ లిట్ టెక్నాలజీ కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube