ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను( CM Manish Sisodia ) ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఈడీ ఆయనను కోర్టు ఎదుట హాజరుపరిచింది.
ఈ క్రమంలోనే మనీశ్ సిసోడియాతో పాటు ఇతర నిందితులకు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీకల ఆదేశాలు జారీ చేసింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.