ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ స్కామ్ లో దేశ వ్యాప్తంగా పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు.
ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ బిఆర్‌ఎస్ చుట్టూ తిరుగుతోంది.తెలంగాణ సిఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈ కేసు వెంటాడుతోంది.
ఈరోజు ( 11న ) కవితను రెండవ సారి విచారిస్తోంది ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.అయితే ఈ లిక్కర్ స్కామ్ అంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనా ? అంటే అవునని కాంగ్రెస్ చెబుతోంది.

తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ” డిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధీచి బీజేపీ, బిఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని, ఈ లిక్కర్ స్కామ్ ఎవరు నామినీలు.ఎవరు బినామీలు అనేది ఈడీ స్పష్టంగా చెబుతోందని, ఎమ్మెల్సీ కవిత పాత్ర చాలానే ఉందని తేల్చిన ఈడీ.ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
బిఆర్‌ఎస్, బీజేపీ మద్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, ఆ రెండు పార్టీలు పైపైకి ప్రత్యర్థి పార్టీలుగా కనిపించిన.లోలోపల ఇరు పార్టీలు ఒక్కటే అని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఆయన చెబుతున్నా వ్యాఖ్యలను బట్టి చూస్తే.ఇరు పార్టీల మద్య పొత్తు ఉందనే చెప్పడం రేవంత్ ఉద్దేశంలా కనిపిస్తోందని కొందరి వాదన.అయితే ఈ వాదనలో ఎంతమేర వాస్తవాలు ఉన్నాయనే సంగతి పక్కన పెడితే.రెండు ప్రత్యర్థి పార్టీల మద్య పొత్తు ఉండడం అనేది కష్టతరమే.అయినప్పటికి రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టమే.అయితే రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా లిక్కర్ స్కామ్ బీజేపీ, బిఆర్‌ఎస్ ప్లానా ? అంటే.అవన్నీ రేవంత్ రెడ్డి రాజకీయ లభ్ది కోసం చెబుతున్నా మాటలు తప్పా ఇంకోటి లేవని మరికొందరి వాదన.మొత్తానికి అనేక మలుపులు తిరుగుతున్న డిల్లీ లిక్కర్ స్కామ్ ప్రశాంత్ కిషోర్ వ్యూహామని రేవంత్ రెడ్డి కొత్త చర్చకు తెరతీశారు.
మరి దీనిపై బిఆర్‌ఎస్ నేతలు, అటు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.