టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలు చేయడంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.తక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం వల్ల ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం తగ్గుతోంది.
అయితే సాయిపల్లవి ఒక సినిమా కోసం రెండేళ్ల డేట్లు కేటాయించారని సమాచారం అందుతోంది.సాధారణంగా హీరోలు ఒక సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించడం జరుగుతుంది.
సినిమా సక్సెస్ సాధిస్తే హీరో మార్కెట్ పది రెట్లు పెరుగుతుంది కాబట్టి హీరో ఎక్కువ రోజులు డేట్లు కేటాయించడంలో తప్పు లేదు.అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో సాయిపల్లవి ఇలాంటి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒక హీరోయిన్ రెండేళ్ల సమయంలో సులువుగా ఆరు నుంచి ఎనిమిది సినిమాలలో నటించడం సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే.
అల్లు అరవింద్ రామాయణంలో సీత పాత్ర కోసం సాయిపల్లవి ఎంపికయ్యారని ఈ పాత్ర కోసం ఆమె మరే సినిమాకు డేట్లు కేటాయించకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సాయిపల్లవి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లు ఆశించడం అత్యాశే అవుతుంది.ఈ కామెంట్ల గురించి సాయిపల్లవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
హీరోయిన్లు రూల్స్ పెట్టుకోవచ్చు కానీ మరీ ఈ రేంజ్ లో రూల్స్ పెట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సాయిపల్లవి నిజంగానే హైబ్రీడ్ హీరోయిన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో పౌరాణిక సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.