ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను( CM Aravind kejriwal ) ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) తీర్పును వెలువరించనుంది.ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై ఇప్పటికే ఈడీ, కేజ్రీవాల్ తరపున వాదనలు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గత విచారణలో రిజర్వ్ చేశారు.ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కేజ్రీవాల్ పిటిషన్ లో తెలిపారు.
ఎన్నికల సమయంలో కావాలనే కుట్ర చేశారంటూ పలు ఆరోపణలు చేశారు.అదేవిధంగా ఈడీ బలవంతంగా వాంగ్మూలాలు సేకరించిందని కేజ్రీవాల్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.