ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్( Delhi CM Arvind Kejriwal ) తో పాటు ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వినిపించారు.
అలాగే కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి( Abhishek Manu Singhvi ) వాదనలు వినిపించారు.డిజిటల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.
కేజ్రీవాల్ మనీలాండరింగ్ నేరానికి( Money Laundering Case ) సంబంధించిన సాక్షం ఒక్కటీ లేదని అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు.ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Case ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.