కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్( Delhi CM Arvind Kejriwal ) తో పాటు ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వినిపించారు.

అలాగే కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి( Abhishek Manu Singhvi ) వాదనలు వినిపించారు.

డిజిటల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.కేజ్రీవాల్ మనీలాండరింగ్ నేరానికి( Money Laundering Case ) సంబంధించిన సాక్షం ఒక్కటీ లేదని అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు.

ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Case ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

పామును చీల్చి చెండాలిన శునకాలు.. వైరల్ వీడియో