ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.లిక్కర్ స్కాం మనీలాండరింగ్( Liquor Scam Money Laundering ) కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.మరోవైపు జైలులో కేజ్రీవాల్ కు నిద్రలేదని ఆప్ నేతలు చెబుతున్నారు.
కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారంటున్న ఆప్ నేతలు నాలుగున్నర కేజీల బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో అనారోగ్యంగా ఉన్నారని ఆప్ నేతలు పేర్కొన్నారు.అయితే ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలు జైలు అధికారులు ఖండించారు.కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు.