ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam Case ) తనను అరెస్ట్ చేయొద్దంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.
ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు( High Court ) తెలిపింది.ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేస్తామో? చెయ్యమో చెప్పలేమని ఈడీ పేర్కొంది.అనంతరం కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి కోర్టు సూచించింది.
అనంతరం తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.







