ఏంటో కొందరు సెలబ్రిటీలు అస్సలు అర్థం కారు.కొన్ని కొన్ని సార్లు వాళ్లు షేర్ చేసే పోస్టులు, స్టోరీలు చూస్తుంటే మాత్రం వీరికి నిజంగా ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
అర్థం లేకుండా పోస్టులు షేర్ చేస్తూ జనాలతో ట్రోల్స్ ఎదుర్కొంటారు.వాళ్ళు ఏ ఉద్దేశంతో అర్థం కాని పోస్టులు పెడతారో కానీ.
అవి చూసి నెటిజన్స్ మాత్రం తప్పకుండా కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇప్పటికే హీరోయిన్ ఆదాశర్మ( Adasharma ) చేసే పోస్టులకు తల పట్టుకుంటారు.
ఒక్కొక్కసారి ఆమె ఏం షేర్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు.ఒక పోస్ట్ షేర్ చేస్తే అందులో ఏదో ఒక అర్థం ఉండాలి.అలా కాకుండా తమకు నచ్చినట్లు పెడితే మాత్రం అంతే సంగతి.అయితే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా ( Deepti Sunaina )కూడా తన పోస్టులతో తల పట్టుకునేలా చేస్తుంది.
అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులను చూస్తే ఎందుకు షేర్ చేస్తుందా అన్నట్లు అనిపిస్తుంది.ఆ మధ్య వరుసగా ఉదయాన్నే జిమ్ నుంచి బయటికి రాగానే ఒక వీడియో చేస్తూ ఉండేది.
ఆ వీడియోలో ఆమె ఏం చెబుతుందో కూడా అర్థం కానట్లుగా ఉండేది.అప్పట్లో ఈ వీడియోలు షేర్ చేసినప్పుడల్లా ఆమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.ఇప్పుడు ఆ వీడియోలు చేయడమే మానేసింది.అయినా అప్పుడప్పుడు లాజిక్ లేని పోస్టులు షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేసుకోగా దీంతో నెటిజన్స్ ఆమెను బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇంతకు ఆమె ఏం పోస్ట్ షేర్ చేసిందో ఒకసారి చూద్దాం.

సోషల్ మీడియా యూజర్లకు దీప్తి సునైన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డబ్స్మాష్ వీడియోలతో, టిక్ టాక్ వీడియోలతో అందరి దృష్టిలో పడి సోషల్ మీడియా స్టార్ గా మారింది.యూట్యూబ్ లలో కూడా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.అలా బిగ్ బాస్ ( Big Boss )లో కూడా అవకాశం అందుకుంది.

దీంతో ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.కానీ వెండితెరపై మాత్రం అంతగా అడుగుపెట్టలేకపోయింది.ఇక ఇప్పటికీ కూడా కవర్ సాంగ్స్ చేస్తూ ఉంది.ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటుంది.
అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా బాగా షేర్ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.

అయితే అందులో తను.కొన్ని కాయగూరలు, ఒక పండు ఉండగా అందులో అవి గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కలర్ లో కనిపించాయి.ఆ స్టోరీలో మూడు రంగులను స్టుపిడ్ ఫెలో అని అన్నది.దీంతో ఆమె ఆ మూడు రంగులను ఎందుకు అలా అన్నదని ఆలోచనలో పడ్డారు.కొంత మంది ఈమెకు నిజంగానే పిచ్చి పట్టిందా అంటూ అనుమానం పడుతున్నారు.మరి కొంతమంది దాని వెనకాల ఏదో కారణం ఉంది అని అంటున్నారు.
ఇక దాని వెనకాల ఏ కారణం ఉందో తెలియదు కానీ ఆమె షేర్ చేసిన స్టోరీ చూసి అందరూ మాత్రం ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.