ఈ సంవత్సరం చాట్ GPT చాట్‌బాట్‌కు దాని ప్రత్యర్థిని విడుదల చేయాలని గూగుల్ ఆలోచిస్తోంది.ఈ విషయాన్ని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం డీప్‌మైండ్ వ్యవస్థాపకుడు డెమిస్ హస్సాబిస్ తెలిపారు.గూగుల్ తీసుకొస్తున్న డీప్‌మైండ్ స్పారో చాట్‌బాట్‌లో OpenAI ChatGPT లేని ఫీచర్లు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.2023లో స్పారోను ప్రైవేట్ బీటాగా విడుదల చేయవచ్చని హస్సాబిస్ చెప్పారు.
అయితే AI మానవాళికి గణనీయమైన నష్టాన్ని కలిగించే స్థాయికి చేరుకోవడంలో ఆందోళన ఉందన్నారు.చాలా శక్తివంతమైన సాంకేతికతలలో AI ఒకటిగా ఉంటుంది.దానితో మనం జాగ్రత్తగా ఉండాలని అతను చెప్పారు.గత సంవత్సరం విడుదలైన చాట్‌జీపీటీ AI సాధారణ ప్రయోజన భాషా మోడల్ పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు చేయగలదని, గూగుల్ సెర్చ్ ఇంజన్ వంటి ప్రసిద్ధ టూల్స్‌ను కూడా భర్తీ చేయగలదని పేర్కొన్నారు.

2010లో స్థాపించిన డీప్‌మైండ్ అనేక ప్రధాన AI మైలురాళ్లను సాధించింది, ఇది క్లిష్టమైన బోర్డ్ గేమ్ గోలో వరల్డ్ ఛాంపియన్‌లను ఓడించడం, తెలిసిన అన్ని ప్రోటీన్‌ల 200 మిలియన్ల నిర్మాణాలను అంచనా వేయడంతోపాటు మరిన్ని కష్టమైన పనులను చేసి ఆశ్చర్యపరిచింది.లండన్‌కు చెందిన ఈ కంపెనీ

మొట్టమొదటగా గత సెప్టెంబర్‌లో ఒక పేపర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) చాట్‌బాట్‌పై పని చేస్తున్నట్లు వెల్లడించింది.ఇది ఇతర లాంగ్వేజ్ మోడల్‌లతో పోలిస్తే మరింత సహాయకారిగా, సరైనదిగా, హానిచేయనిదిగా ఉండనుంది.డీప్‌మైండ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ ప్రపంచం ఇంకెంత గొప్పగా మారుతుందో చూడాలి మరి.







