ఆ సెంచరీ చేయడం వెనకాల వున్న అసలు కారణాలు చెప్పేసిన దీపక్‌ హుడా!

దీపక్‌ హుడా.క్రికెట్ మైదానంలో గత కొన్నాళ్లుగా బాగా వినబడుతున్న పేరు.

 Deepak Hooda Reveals The Real Reasons Behind Making That Century, Deepak Hooda,-TeluguStop.com

తాజాగా రెండో టీ20లో విజయం సాధించాక అతడు మీడియాతో సంభాషించాడు.ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమ్‌ ఇండియా ఏరకమైన ఆటని కనబరిచిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

మంగళవారం రాత్రి జరిగిన రెండో మ్యాచులో 4 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.ప్రత్యర్థి బ్యాటర్లు విధ్వంసకరంగా ఆడినా 225 స్కోరును రక్షించుకుంది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసినందుకు ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా క్రికెటర్‌ దీపక్ హుడా పేర్కొన్నాడు.

అరంగేట్రం చేసిన సిరీసులోనే హుడా మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు అందుకోవడం హర్శించదగ్గ విషయం.

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ… “నేను IPL నుంచి వచ్చాను.IPLలో నేను ఆడిన ఆట గురించి అందరికీ తెలుసు.అదే ఫామ్‌ను ఇక్కడా కొనసాగించేందుకు ప్రయత్నించాను.దూకుడుగా ఆడటం నాకిష్టం.

బ్యాటింగ్‌కు ముందుగానే రావడంతో నాకు సమయం దొరికింది.పరిస్థితులకు తగ్గట్టు ఆడాను.

సంజూ చిన్ననాటి మిత్రుడు.మేమిద్దరం కలిసి అండర్‌-19 క్రికెట్‌ కలిసి ఆడాం.

అతడూ భారీ స్కోరు చేసినందుకు హ్యాపీగా ఉంది.ఐర్లాండ్‌ చాలా బాగుంది.

ఇక్కడెంతో ఎంజాయ్‌ చేశాను.అలాగే అభిమానులు అండగా నిలిచారు.” అని దీపక్‌ హుడా అన్నాడు.

Telugu Century, Deepak Hooda, Ishan Kishan, Sanju Samson-Latest News - Telugu

ఇలా పలు రకాల కారణాలు తనని బాగా ఆడేలా చేశాయని అభిప్రాయపడ్డాడు.ఇకపోతే మొదట జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3) అవుట్ అవ్వడం అందరికీ షాక్ ని ఇచ్చింది.కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఆట.అంతర్జాతీయ క్రికెట్లో తమ సత్తా చాటాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న దీపక్‌ హుడా (104), సంజు శాంసన్‌ (77) చెలరేగిపోయి ఆడారు.నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడిమరీ బౌండరీలు, సిక్సర్లు బాదేశారు.

సంజు, హుడా కలిసి రెండో వికెట్‌కు 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం అందించారు.ఆ విధంగా జట్టు స్కోరును 225/7కు చేర్చి చరిత్ర లిఖించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube