ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు.ఒక్కొక్క సెలబ్రిటీ వారికున్న అరుదైన వ్యాధుల గురించి బయట పెడుతూ అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే సమంత, మమతా మోహన్ దాస్, హంసానందిని ఇలాంటి సెలబ్రిటీలు అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.

వీరితో పాటుగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వారికి ఉన్న అరుదైన వ్యాధుల గురించి బయట పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా మరో బుల్లితెర నటి కూడా అరుదైన వ్యాధి బారిన పడింది.నటికీ అరుదైన వ్యాధి సోకినట్లు తెలిసింది.వైరస్ సోకిన వారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.ఇటీవల తన భర్త పిల్లలతో కలిసి శ్రీలంక టూర్ కి వెళ్ళింది ప్రముఖ బాలీవుడ్ దేబీనా బోనర్జీ. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల్లో ఆమెకు ఇన్ఫ్లుఎంజా బి అనే వైరస్ సోకినట్లు తెలిసింది.
ఆ వైరస్ బారిన పడిన వారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారట.ఆ నటికి జలుబుగా ఉండడంతో చాలా రోజుల నుంచి అదే జలుబు అని భావించి ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదట.

కానీ జలుబు జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆ పరీక్షల్లో ఆ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆమె మొదట షాక్ అయిందట.ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.కాగా దేబీనా బోనర్జీ బాలీవుడ్ లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆమె తొందరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.







