ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌పై మధ్యంతర నివేదకను హౌస్ కమిటీ ప్రవేశపెట్టింది.గత ప్రభుత్వ హయాంలో ప్రజల డేటా చౌర్యం జరిగిందని హౌస్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు.సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షలకు పైగా ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందన్నారు.
ఆ దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని భూమన తెలిపారు.స్టేట్ డేటా సెంటర్ లో ఉంచాల్సిన సమాచారం టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదిక ఆధారంగా పూర్తి విచారణ జరపాలని కోరారు.