ప్రపంచ కప్ 2023లో చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడుగా డేవిడ్ వార్నర్..!

వన్డే వరల్డ్ కప్ లో బెంగుళూరు వేదికగా జరిగిన ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్( David Warner ) విధ్వంసక బ్యాటింగ్ ఆడాడు.పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడి 84 బంతుల్లో సెంచరీ చేశాడు.124 బంతుల్లో 14 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 163 పరుగులు చేశాడు.ఈ ఒక్క మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ 2023లో చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడుగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.ప్రపంచ కప్ చరిత్రలో మూడుసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.2015 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో 178 పరుగులు, 2019 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్లో 166 పరుగులు చేశాడు.తాజాగా 2023 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో 163 పరుగులు చేశాడు.

 David Warner Is The Only One Who Created History In World Cup 2023 , David Warne-TeluguStop.com
Telugu Australia, David, Pakistan, Rohit Sharma, Virat Kohli, Cup-Sports News

వన్డేల్లో అత్యధిక సార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.ఈ జాబితాలో 8 సార్లు 150+ స్కోర్ చేసి రోహిత్ శర్మ అగ్రస్థానం( Rohit Sharma )లో ఉన్నాడు.ఏడుసార్లు 150+ స్కోరు చేసి డేవిడ్ వార్నర్ రెండవ స్థానంలో ఉన్నాడు.

ఐదు సార్లు 150+ స్కోరు చేసి సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ప్రపంచ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

సచిన్ టెండుల్కర్ ఆరు సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.రికీ పాంటింగ్, కుమార సంగక్కర, డేవిడ్ వార్నర్ ఐదు సెంచరీలతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

Telugu Australia, David, Pakistan, Rohit Sharma, Virat Kohli, Cup-Sports News

ప్రపంచ చరిత్రలో భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) పేరిట ఉండే ఒక రికార్డును డేవిడ్ వార్నర్ సమం చేశాడు.ఆ రికార్డు ఏమిటంటే.వెస్టిండీస్ జట్టుపై వన్డేల్లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు బాదాడు.తాజాగా డేవిడ్ వార్నర్ కూడా పాకిస్తాన్ జట్టుపై వన్డేల్లో నాలుగు సెంచరీలు పూర్తి చేశాడు.ఈ వన్డే వరల్డ్ కప్ 2023 లో గతంలో ఎన్నడూ లేని విధంగా పాత రికార్డులు బ్రేక్ అవుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.ఈ టోర్నీ పూర్తయ్యే లోపు ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube