నిద్రిస్తున్న అత్త మీద కోడలి కిరాతకం.. జగనన్న పధకం పెట్టిన చిచ్చు.. ?

ప్రజల కష్టాలను కొంతైన తీర్చడానికి ప్రభుత్వాలు పధకాల రూపంలో డబ్బుల సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఏపీలో జగన్ ప్రభుత్వం వైయస్సార్ జగనన్న చేయూత పేరుతో కొంత నగదు అందిస్తున్నారు.

అయితే ఈ పధకం అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టి చివరికి అత్తను చావు అంచులకు తీసుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

Gudivada, Daughter In Law, Muder Attempt, Aunty, Ysr Jagananna Cheyutha Scheme,l

వైయస్సార్ జగనన్న చేయూత డబ్బులు కోడలు స్వరూపకు ఇవ్వనందుకు మనసులో కక్ష పెట్టుకున్న ఈవిడ, మందపాడులోని తన ఇంట్లో నిద్రిస్తున్న అత్త చుక్కా లక్ష్మీ పై, వేడి వేడి నూనె పోయగా ఒళ్లంతా కాలిపోయి బొబ్బలతో చర్మం ఉడడానికి వచ్చిందట.ఆ బాధ తాళలేక అరచిన అరుపులకు చుట్టుపక్కల వారు ఘటన స్దలానికి వచ్చి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట.కాగా ప్రస్తుతం లక్ష్మీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇకపోతే ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని లక్ష్మి కొడుకు అయిన శివ నారాయణను, కోడలు స్వరూపలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.

Advertisement
Gudivada, Daughter In Law, Muder Attempt, Aunty, Ysr Jagananna Cheyutha Scheme,l
ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?

తాజా వార్తలు