ఫేస్ బుక్ ప్రేమ ... తల్లిని చంపించిన కూతురు !

ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని రోజులు ఇవి… ఇప్పుడు యువత అంతా సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు.ఆ మాయలో పడి తాము ఏంచేస్తున్నామో… ఏం జరుగుతుందో తెలియని మైకంలో పడిపోతున్నారు.తాజాగా ఇటువంటి సంఘటనే… తమిళనాడులోని… తిరువళ్ళూరులో ఆంజనేయ పురంలో దేవీప్రియ తన తల్లి భానుమతితో కలిసి నివసిస్తుంది.19 సంవత్సరాల దేవీప్రియ స్థానిక అవడి అనే కాలేజీలో బీకాం రెండవ సంవత్సరం చదువుతుంది.ఆమెకు ఫేస్ బుక్ లో ఎస్.సురేశ్(19) అనే అతను దేవీకి పరిచయమయ్యాడు.వీరు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారు.

 Daughter Killed Her Mother-TeluguStop.com

తంజావూరు లోని కుంభకోణంలో సురేశ్ నివసిస్తున్నాడు.అయితే ఆమె ఈ విషయాన్ని తన తల్లి భానుమతికి చెప్పింది .తాము ఒకరినొకరు చూసుకోకుండా ఫేస్ బుక్ మాధ్యమంగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది.

దీంతో కోపానికి వచ్చిన భానుమతి.ముందుగా చదువుపై శ్రద్ధ వహించమని.

ఫేస్ బుక్ ప్రేమలను నమ్మవద్దని చెప్పింది.కూతురి స్మార్ట్ ఫోన్ పై కూడా భానుమతి ఆంక్షలు విధించింది.

దీంతో తల్లిని చంపడానికి దేవీప్రియ నిర్ణయం తీసుకుంది.అందుకు తన ప్రియుడైన సురేశ్ సాయం కోరింది.

అందుకు అంగీకరించిన సురేశ్ సోమవారం ఇద్దరు మైనర్ లను దేవీప్రియ ఇంటికి పంపాడు.

సురేశ్ పంపిన ఆ ఇద్దరికి దేవీప్రియ తన తల్లిని చూపించింది.దీంతో ముగ్గురు కలిసి తల్లి భానుమతిని కొడవళ్ళతో హత్య చేశారు.దాడి చేస్తున్నప్పుడు భానుమతి పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వారిని పోలీసులకు పట్టించారు.

పోలీసుల విచారణ లో దేవీప్రియ అసలు విషయం చెప్పడంతో ఆమెతో పాటు … ఆమె ప్రియుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube