సినిమాలకు గుడ్ బై చెప్పిన డ్యాషింగ్ హీరో.. ఏం జరిగిందంటే?

గత ఆరు దశాబ్దాల కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ సేవలు అమోఘమని చెప్పవచ్చు.నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేషమైన గుర్తింపును సంపాదించుకున్న కృష్ణ వెండితెరపై కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా చిత్రాల్లో నటిస్తూ విశేష ఆదరణ సంపాదించుకున్నారు.

 Super Star Krishna, Good Bye To Movies, Tollywood, Krishna Carrier,interview-TeluguStop.com

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కృష్ణ ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది.

మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాలను నవ్య పంథాలో నడిపించిన దర్శకుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు.

వెండితెరపై ఈయన చేయని ప్రయత్నం అంటూ లేదు.ఈ విధంగా అన్ని ప్రయత్నాలను ఎంతో ధైర్యంగా చేస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

హీరోగా సినిమాలకు దూరమైన కృష్ణ ఆ తర్వాత పలు సినిమాలలో తండ్రి, తాత పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఈ విధంగా అభిమానులను సందడి చేసిన కృష్ణ తన అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు.

Telugu Bye, Krishna Carrier, Krishna, Tollywood-Movie

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ కెరియర్ పట్ల ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాను.సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారన్న భాద తనలోలేదని, ఇంతకాలం సినిమాలలో చేయడమే తన అదృష్టమని ఇకపై ఏ విధమైనటువంటి పాత్రలలో నటించి వెండితెరపై కనిపించబోనని, వెండితెరకు పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు.కృష్ణ 2016 వ సంవత్సరంలో శ్రీ శ్రీ అనే సినిమాలో చివరిగా నటించారు.సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చిన ఈయన నానక్ రామ్ గూడలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే కృష్ణ సినిమాలకు దూరమై దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్వ్యూ ద్వారా స్వయంగా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube