రేలంగిని దాసరి ఎందుకు కొట్టాడో తెలుసా?

రేలంగి నర్సింహారావు.తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన గురించి ప్రత్యేకంగా వివరణ అవసరం లేదు.

ఎన్నో అద్భుత సినిమాలో నటించిన అద్భుత నటుడు ఆయన.పలు చక్కటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు రేలంగి.ఎంతో మంది హీరోలు, హీరోయిన్లతో కలిసి పనిచేశాడు ఆయన.తాజాగా ఈ సీనియర్ నటుడు అలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొన్నాడు.తన కెరీర్ లో జరిగిన పలు ఘటనల గురించి ఇందులో సవివరంగా వివరించాడు.

ఇంతకీ తను ఏం చెప్పాడో ఇప్పడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ షోలో పాల్గొన్న రేలంగిని అలీ సాదరంగా స్వాగతించాడు.

అనంతరం నటుడు రేలంగి వెంకటరామయ్యకు మీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని అడిగాడు.దీనికి ఆసక్తికర విషయం చెప్పాడు రేలంగి.

Advertisement
Dasari Slapped Comedian Relangi In The Set, Dasari Relangi, Dasari Narayana Rao,

వెంకటరామయ్య ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు రేలంగి నర్సింహారావును పిలిచాడట.నీ పేరు నుంచి రేలంగిని తీసేసుకో అని చెప్పాడట.

ఎందుకు సార్ అని అడిగాడట రేలంగి.సెట్ లో మీ గురువు గారు ఎవరిని తిడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పాడట.

ఆ తిట్లు తిట్టేది నిన్నో నన్నో తెలియట్లేదు అన్నాడట.అప్పటి నుంచి రేలంగి నర్సింహారావును నర్సింహారావుగా మార్చుకున్నట్లు చెప్పాడు.

తను చిన్నతనంలో కోడి రామక్రిష్ణతో కలిసి చదువుకునే వాడట రేలంగి.అప్పట్లో ఈ ఇద్దరు కొట్లాడుకునే వారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

అనంతరం ఇద్దరు మంచి మిత్రులుగా కొనసాగినట్లు వెల్లడించాడు.

Dasari Slapped Comedian Relangi In The Set, Dasari Relangi, Dasari Narayana Rao,
Advertisement

అటు దాసరి నారాయణ రావు గురించి కూడా రేలంగి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.దాసరి దగ్గర మొదట్లో తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చెప్పాడు.ఆ సమయంలో దాసరి, రేలంగికి మధ్య ఓ ఘటన జరిగిందట.

క్లాప్ బోర్డు కింద పెట్టి కుర్చీలో కూర్చుని ఏదో రాస్తున్నాడట రేలంగి.దే సమయంలో దాసరి అక్కడికి వచ్చాడట.

క్లాప్ బోర్డు తన కాళ్ల మధ్యన ఉండటం చూసి చెంప మీద ఒక్కటిచ్చాడట దాసరి.అప్పటి నుంచి క్లాప్ బోర్డును జాగ్రత్తగా చూసుకునే వాడిని అని చెప్పాడు.

తాజా వార్తలు