టీఆర్ఎస్‌కు సవాల్‌గా మారిన కొత్త అభ్యర్థి.. ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా?

హుజురాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ విదితమే.

ఈ క్రమంలోనే గులాబీ బాస్ ‘దళిత బంధు’ పథకం తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బై ఎలక్షన్ బరిలో ఉన్నారు.త్వరలో ఆయన మళ్లీ పాదయాత్ర షురూ చేయబోతున్నారు.

ఇకపోతే ఆయనకు పోటీగా టీఆర్ఎస్ తరఫున అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే, ఇటీవల కాలంలో గులాబీ బాస్ హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థినేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేసినట్లు కథనాలు వచ్చాయి.

ప్రచారం కూడా జరిగింది.అయితే, ఈయన ఈ ప్రాంత వాస్తవ్యుడే అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిగానే ప్రజలు చూస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి ఈయన పరిచయం ఉన్నప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కొత్త అభ్యర్థిగానే ఉండబోతున్నారని, ఇది అధికార పింక్ పార్టీకి సవాల్‌గా ఉండబోతున్నదనే టాక్ వినిపిస్తోంది.ఈ క్రమంలోనే అతడిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

అయితే, అధికా పార్టీ ఆలోచనల ప్రకారం ముల్లును ముల్లుతో తీసేసే క్రమంలోనే బీసీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు బీసీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దించుతున్నట్లు సమాచారం.మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు.

కానీ, నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏం జరగబోతున్నది? అని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు.ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ, ఈటల భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు