Dasari Narayana Rao : దాసరిని నమ్ముకున్న శ్రీవిద్య..కానీ చివరికి ..?

కేరళలో పుట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటీమణుల్లో శ్రీవిద్య కూడా ఒకరు.ఆమె కేవలం మలయాళం, తమిళ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించారు.

 Dasari Encouraged Srividya In Tollywood-TeluguStop.com

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో వందల సినిమాల్లో నటించింది శ్రీవిద్య.కానీ ఆమెకు బొద్దుగా ఉంది అనే ఒకే ఒక కారణంతో తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు కరువయ్యాయి.

ఒకానొక సమయంలో దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) సైతం ఆమెకు మొండి చేయి ఇవ్వడంతో ఆమె ఇండస్ట్రీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.దాసరి, శ్రీవిద్య మధ్య జరిగిన అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Telugu Dasari, Srividya, Simha Raju, Srividya Telugu, Tollywood-Latest News - Te

అయితే తమిళ్లో బొద్దుగా ఉన్న హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువ.కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచి మరోలా ఉండేది.తెలుగు వారికి హీరోయిన్స్ అంటే నాజూగ్గానే ఉండాలి.కానీ దాసరి నారాయణరావు ప్రయోగాలకు పెట్టింది పేరు కాబట్టి ఆమెను తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు.

శ్రీవిద్య కాస్త బొద్దుగా ఉన్నప్పటికి, నరసింహా రాజుని హీరో గా పెట్టి తూర్పు పడమర అనే సినిమా( Thoorpu padamara ) తీశారు.అయితే మొదట ఈ చిత్రంలో శోభన్ బాబుని హీరోగా పెట్టే సినిమా తీయాలనుకున్నారు కానీ ఆయన దాసరి తూర్పు పడమర సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా మారడంతో ఆ కాంబినేషన్ మిస్ అయింది.

Telugu Dasari, Srividya, Simha Raju, Srividya Telugu, Tollywood-Latest News - Te

చాలామంది నరసింహారాజు హీరో ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆయన అలా ప్రయోగాలు చేయడం దాసరికి కొత్త కాదు.రోడ్డున వెళ్లే వారిని కూడా తీసుకొచ్చి హీరోలుగా నటింపజేసి సక్సెస్ అందుకోవడం ఆయనకు మొదటి నుంచి అలవాటు.అందుకే నరసింహా రాజు( Narasimha Raju ) ఈ చిత్రంలో హీరోగా , శ్రీవిద్య హీరోయిన్ గా నటించడంతో సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.

ఇక ఆ తర్వాత కాలంలో శ్రీవిద్యను హీరోయిన్ గా పెట్టి మళ్ళీ సినిమా చేయాలని భావించిన నిర్మాతలు ఆమె లావుగా ఉంది అనే కారణంతో ముందుకు రాలేదు.అలా ఆమె ను మళ్లీ హీరోయిన్ గా తీసుకోవాలన్న దాసరి కోరిక నెరవేరలేదు.

ఆమె స్థానంలో మరి కొంత.మంది హీరోయిన్స్ ని దాసరి పరిచయం చేస్తూ వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube