నాని దసరాకు అంత సాహసం చేసారా..?

న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న దసరా సినిమా టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచారు.సినిమాను ఎస్.

 Dasara Real Budget Secret Revealed, Dasara , Nani , Keerthy Suresh , Tollywood-TeluguStop.com

ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మించారు.ఈ సినిమాకు మొదట 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారట.అయితే సినిమా కంటెంట్ బాగుండటం వల్ల సినిమాకు ఎక్కువ బడ్జెట్ అవసరం ఉండటంతో 35 కోట్లు అనుకున్నది కాస్త 65 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించారట.

నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.సినిమా కథ నచ్చబట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చేసినట్టు తెలుస్తుంది.

టీజర్ లో నాని క్యారక్టరైజేషన్ మాత్రం అరుపులు పుట్టించింది.సినిమా కూడా అనుకున్న రేంజ్ ఉంటే మాత్రం అదిరిపోయినట్టే.65 కోట్ల బడ్జెట్ అయిన ఈ సినిమాకు 80 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.అది కాకుండా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయట.

మార్చి 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ పడితే మాత్రం నాని కూడా నెక్స్ట్ లెవెల్ హీరోగా ప్రమోట్ అయినట్టే లెక్క.కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న నాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube