స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్న నేపథ్యంలో టైర్ 2 హీరోలు కూడా మేము ఏ మాత్రం తక్కువ కాదు అనేట్టుగా వారు కూడా పాన్ ఇండియన్ సినిమాలతో రెడీ అవుతున్నారు.మరి టైర్ 2 హీరోల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని (Nani) కూడా పాన్ ఇండియా సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ముందు నుండి భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో నాని విజయం సాధించాడు అనే చెప్పాలి.
నాని హీరోగా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”దసరా”(Dasara).
రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించారు.ధరణి పాత్రలో నాని నటిస్తుండగా నాని, కీర్తి ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలలో కనిపించారు.
నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా ముందు నుండి ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.

ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది.దసరా సినిమాకు అనుకున్న విధంగానే యూఎస్ (US box office) లో కూడా మంచి అంచనాలు పెరిగాయి.అక్కడ కూడా ముందు నుండి పెరిగిన అంచనాల మధ్య సెన్సేషనల్ రెస్పాన్స్ లభించినట్టు తెలుస్తుంది.
తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేసినట్టు తెలిపారు.

యూఎస్ డిస్టిబ్యూటర్స్ అందించిన సమాచారంతో ఈ సినిమా అక్కడ ప్రీమియర్స్ ద్వారానే 5 లక్షల 50 వేల డాలర్స్ కి పైగానే గ్రాస్ ను రాబట్టినట్టు కన్ఫర్మ్ చేయడంతో ఈ సినిమా యూఎస్ లో ఏ రేంజ్ లో అలరిస్తుందో అర్ధం అవుతుంది.మరి ఈ సినిమా ఇక్కడ ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే.కాగా ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.







