కొంత మంది పొరపాటున ఏదైనా సమస్యలో పడతారు.కానీ అదే అలవాటయితే దానికి ఏమని పేరు పెట్టచ్చు.
ఇది సామాన్యుల జీవితంలో జరిగితే పట్టించుకునే వారు ఉండరు కానీ స్టార్ డం వచ్చి హీరో గా ఒక వెలుగు వెలుగుతూ అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఎదో ఒక తప్పుతో ఎప్పుడు కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్డ్రస్సు అయితే ఎలా ఉంటుంది చెప్పండి.అంత కన్నా దారుణం మరొకటి ఉండదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు కన్నడ హీరో దర్శన్ తెలిసే ఉంటుంది.ఇక్కడ పెద్దగా తెలియకపోయిన కన్నడ నాట మాత్రం అతడికి బాగానే క్రేజ్ ఉంది.
ఆయనకు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు.అయితే హీరో అన్నాక ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ ఇతడు ఎందుకు హీరో అయ్యాడో అసలు అర్ధం కావడం లేదు.
జీవితం మొత్తం కాంట్రవర్సీలు ఉన్నాయ్.హీరో గా మంచి సినిమాలు చేస్తూ తన ఫాన్స్ కి మెసేజ్ ఇవ్వాల్సిన ఈ హీరో భార్యను గన్ తో చంపడానికి బెదిరించి చాల కర్కశం గ వ్యవహరించాడు.
ఆమె గృహ హింస కేసు పెట్టడం తో 14 రోజుల పాటు బెయిల్ కూడా దొరకకుండా చిక్కుల్లో పడ్డాడు.ఆ తర్వాత కోర్ట్ బయట పరిష్కారం చేసుకొని ఎలాగోలా ఆ గొడవ నుంచి బయట పడ్డాడు.
భార్యకు క్షమాపణ చెప్పి వ్యక్తి గత జీవితం కూడా సెట్ చేసుకున్నాడు.హీరోయిన్ అనిత తో వ్యవహారం లో ఇద్దరికీ మనస్పర్థలు మొదలయి అది కోర్ట్ దాకా వెళ్ళింది.
చివరికి బహిరంగంగా ఫ్యాన్స్ కి క్షమించమని వేడుకున్నాడు.
ఇక ఒక దళిత వెయిటర్ ని చెంప పగలగొట్టి వార్తల్లోకి ఎక్కాడు.ఇవన్నీ చాలవు అన్నట్టు ఆ మధ్య ఒక నిర్మాత తనను చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు.ఇక ఇతగాడికి ఒక మినీ జూ కూడా ఉంది.
జంతువులు అంటే మహా ప్రాణం దర్శన్ కి.మైసూర్ కి అతి దగ్గరలో మాలవల్లి అనే అడవి ఏరియా లో ఈ జూ ఉంది.అయితే ఇక్కడ సల్మాన్ ఖాన్ తరహా వన్యప్రాణులని తినే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక రూమర్ ఉంది.ఇక ఇప్పుడు తాజాగా పునీత్ పై ఏవో అకారణంగా దర్శన్ వ్యాఖ్యలు చేసుకున్నాడని క్రాంతి సినిమా ప్రమోషన్ కి వచ్చిన సమయం లో అతడి పై పునీత్ ఫ్యాన్స్ లో ఒకరు చెప్పు విసిరారు.
దర్శన్ తమ ఏరియా కి రావద్దు అంటూ ముందు నుంచి గొడవ జరుగుతుంది.