పిస్తా ప‌ప్పు తింటున్నారా..ఇవి తెలుసుకోకపోతే రిస్క్ త‌ప్ప‌దు!

పిస్తా ప‌ప్పు. చాలా మంది ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్‌‌లో ఇవి ఒక‌టి.

పసుపు వచ్చ వర్ణంలో ఉండే పిస్తా ప‌ప్పు ప్ర‌త్యేక‌మైన రుచి క‌లిగి ఉంటాయి.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ పిస్తా ప‌ప్పుల‌ను ఇష్టంగా తింటుంటారు.

ఇక వీటి ధ‌ర కాస్త ఎక్కువే.అయిన‌ప్ప‌టికీ పిస్తా ప‌ప్పులో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు పిస్తా ప‌ప్పులో ఉంటాయి.అటువంటి పిస్తా ప‌ప్పులు డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండవ‌చ్చు.

Advertisement

పిస్తా ప‌ప్పులు తీసుకోవ‌డం మెద‌డు షార్ప్‌గా కూడా ప‌ని చేస్తుంది.అయితే పిస్తా ప‌ప్పు ఆరోగ్యానికి ఎంతో  మేలు చేసిన‌ప్ప‌టికీ.

అతిగా తీసుకుంటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది.ముఖ్యంగా పిస్తా ప‌ప్పుల‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

అవును, పిస్తా ప‌ప్పు మోతాదుకు మించి తీసుకుంటే.అందులో ఉండే కాల్షియం ఆక్సాలేట్ మ‌రియు సిస్టైన్ మూత్ర‌పిండాల్లో పేరుకు పోయి రాళ్లు ఏర్ప‌డేలా ప్రేరేపిస్తాయి.అలాగే పిస్తా ప‌ప్పును అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో అల‌ర్జీలు త‌లెత్తుతాయి.

ముఖ్యంగా ద‌ద్దుర్లు, చ‌ర్మం దుర‌ద పెట్ట‌డం, తుమ్ముళ్లు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.ఒక‌వేళ ఏదైనా అల‌ర్జీతో బాధ ప‌డుతుంటే.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అలాంటి వారు పిస్తా ప‌ప్పుల‌ను దూరంగా ఉండట‌మే మంచిది.ఎందుకంటే, ఇవి స‌మ‌స్య‌ల‌ను మ‌రింత ఎక్కువ చేస్తాయి.

Advertisement

ఇక సాధార‌ణంగా బ‌రువు త‌గ్గించ‌డంలో పిస్తా ప‌ప్పు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డాతాయి.కానీ, అదే పిస్తా ప‌ప్పును అతిగా తీసుకుంటే.

శ‌రీరంలో కొవ్వు పెరిగి పోతుంది.దాంతో బ‌రువు మరింత పెరుగుతారు.

అదే విధంగా,ఆరోగ్యానికి మంచివి క‌దా అని పిస్తా ప‌ప్పుల‌ను అతిగా తీసుకుంటే.క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా ఉంటుంది.

తాజా వార్తలు