ఎక్కువ సేపు కూర్చుంటున్నారా.. జాగ్ర‌త్త‌!

నేటి కాలంలో ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేవారు అధికంగా ఉంటున్నారు.ఇక టీవీ చూసేట‌ప్పుడు, ఫోన్ వాడేట‌ప్పుడు కూడా ఎలాగో కూర్చునే ఉంటారు.

అయితే ఇలా ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా ఒకేచోట కూర్చోవ‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ఇలా ఎక్కువ సేపు కూర్చుని ప‌ని చేయ‌డం వల్ల ప్రధానంగా వెన్నుముకకి సంబంధించిన సమస్యలు త‌లెత్తుతాయి.

ఈ క్ర‌మంలోనే నడుమునొప్పి, వెన్నునొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే ఎక్కువ సేపు కూర్చోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి.ఊబ‌కాయం రావ‌డానికి కూడా అధికంగా కూర్చోవ‌డ‌మే ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.అదేవిధంగా, ఎక్కువ సేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల కండరాల బలహీనత సమస్య ఏర్ప‌డుతుంది.

Advertisement

అదే స‌మ‌యంలో కాళ్ల‌కు స‌రిగ్గా రక్తప్రసరణ జ‌ర‌గ‌కా.వాపులు, నొప్పులు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

ఇక ఎంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారు అయినా ఎక్కువ సేపు కూర్చుంటే.అనేక వ్యాధుల బారిన‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుంది.

మ‌రి ఇన్ని స‌మ‌స్య‌లకు చెక్ పెట్టాలంటే.క‌నీసం గంట‌కు ఒక‌సారి అయినా పైకి లేచి అటు, ఇటు ప‌ది అడుగులు వేస్తే మంచిదంటున్నారు నిపుణులు.

సో.జాగ్ర‌త్త‌!.

బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.. ఇంటర్ లో 978 మార్కులు.. కుసుమ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

Advertisement

తాజా వార్తలు