చిరంజీవితో డాన్స్ అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే: రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) తో నటించాలనీ ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

ఆయన సినిమాలు చిన్న పాత్రలో అవకాశం వచ్చినా నటించడానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు.

అలాగే హీరోయిన్స్ కూడా చిరంజీవి సినిమాలలో నటించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇక చాలామంది చిరంజీవి సినిమాలో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చినా కూడా చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే స్పెషల్ సాంగ్స్ చేయడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి రెజీనా( Regina) సైతం చిరంజీవి సినిమాలో నటించడం కోసం ఏకంగా ఆచార్య ( Aacharya ) సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా అప్పటివరకు ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయనీ రెజీనా కేవలం చిరు సినిమాలో నటించాలన్న ఉద్దేశంతోనే ఈ సాంగ్ చేశానని ఇకపై తాను స్పెషల్ సాంగ్స్ చేసే ఉద్దేశంలో లేనని తెలిపారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రెజీనా చిరంజీవితో కలిసి ఈ సాంగ్ కి డాన్స్ వేయడం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చిరంజీవి గారితో డాన్స్ చేయడం ఎప్పటికీ తనకు గ్రేట్ గా అనిపిస్తుందని తెలిపారు.

Advertisement

చిరంజీవి గారి డాన్స్ కు ఆయన బాడీలోని గ్రేస్ కి హాట్సాఫ్.తాను భరతనాట్యం నేర్చుకున్నా కూడా చిరంజీవి గారితో కలిసి డాన్స్ చేయడం అంటే హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేయడమే అంటూ ఈ సందర్భంగా చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో శ్రియ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు