100% ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిరంతరం అందిస్తూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ మాధ్యమం ఆహా. సూపర్ హిట్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్‌లను అందించింది.
వీటితో పాటు క్రేజీ షోస్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా.రొటీన్ ప్రోగ్రామ్స్ కాకుండా కొత్తదనమున్న కాన్సెప్టులతో షోస్‌ను అందిస్తూ టాప్ రేంజ్‌లోకి దూసుకెళుతోంది.అలాంటి ఆహా నుంచి సాధారణ ప్రేక్షకులతో పాటు డాన్స్ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందిన డాన్స్ షో ‘డాన్స్ ఐకాన్’.ఏదో ఆషామాషీగా కాకుండా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ డ్యాన్స్ షోగా డ్యాన్స్ ఐకాన్ ఆడియెన్స్‌ను అలరించింది.
ఎట్టకేలకు డాన్స్ ఐకాన్ ఫస్ట్ షో విన్నర్స్‌గా అసిఫ్, రాజు నిలిచారు.ఈ ఏడాది మెగా ఈవెంట్లకా బాప్ అన్నట్టు డ్యాన్స్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేలో అదిరిపోయే డ్యాన్స్‌తో పాటు ఢిఫరెంట్ థీమ్స్‌తో పోటీదారులు ప్రేక్షకులను, న్యాయ నిర్ణేతలను మెప్పించటానికి 13 వారాల పాటు కష్టపడ్డారు.
ప్రేక్షకులను మరియు న్యాయనిర్ణేతలను మంత్రముగ్ధులను చేయడంలో పోటీదారులు 13 వారాల పాటు శ్రమించారు.అసిఫ్ అతని కొరియోగ్రాఫర్ రాజు ఎలాంటి డాన్స్ స్టైల్ అయినా తమకు పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు.
వీరిద్దరరూ మిగిలిన 12 మంది పోటీదారులతో ఆహా డాన్స్ ఐకాన్‌లో పెద్ద యుద్ధమే చేసి విజేతలుగా నిలిచారు.శిఖరాగ్రాలను అందుకున్నారు.విజేతగా నిలిచిన అసిఫ్ 20 లక్షల రూపాయల నగదుతో పాటు విన్నర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.ఇక రాజు అయితే టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.
డాన్స్ ఐకాన్ సెట్స్‌లో న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటించి ట్రోఫీని అందించారు.
ఓ థీమ్‌కు కట్టుబడి డాన్స్ ఐకాన్ షో ఫినాలెను ఘనంగా నిర్వాహకులు నిర్వహించారు.
ఈ ఫినాలె మామూలుగా జరగలేదు.ఇంతకు ముందెన్నడూ లేనంత బోల్డ్‌గా, పోటాపోటీగా, పోటీలో గెలవాలనే కసిని రేపేలా కంటెస్టెంట్స్ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, షో పాల్గొన్న కంటెస్టెంట్స్ అధినేత అయిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రవి శంకర్, ఎస్‌వీసీసీ బ్యానర్ బాపినీడు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ వంటి స్టార్ ప్రొడ్యూసర్స్ ఫినాలెలో పాల్గొన్నారు.కంటెస్టెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తూ వారిలోని ఎనర్జీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు.
షోను విజయవంతంగా పూర్తి చేయటంలో తమ వంతు పాత్రను పోషించారు.డాన్స్ ఐకాన్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ ‘‘డాన్స్ ఐకాన్ విజేతలుగా నిలవటం మరచిపోలేని జర్నీ.
ఈ జర్నీలో భాగమైన నా కంటెస్టెంట్ రాజుకి థాంక్స్.నా తోటి కొరియోగ్రాఫర్స్ వారి ప్రదర్శనతో నన్ను ఛాలెంజ్ చేస్తూ వచ్చారు.
అలాగే ప్రతీ వారం జడ్జీలు కూడా నాలో స్ఫూర్తి నింపుతూ వచ్చారు.అందువల్లనే విజేతగా ఈరోజు ఇక్కడ నిలిచాం.
షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఆహా యాజమాన్యానికి థాంక్స్.నా కలను నిజం చేశారు.’’
ఆహా సి.ఇ.ఒ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘డాన్స్ ఐకాన్ అందరినీ చాలా ఎంటర్‌టైన్ చేసింది.మేం కంటెస్టెంట్ నుంచి అద్భుతమైన పెర్పామెన్స్‌ను రాబట్టంలో సక్సెస్ సాధించాం.
వివిధ రకాల డాన్స్ రూపాలను వారి నుంచి బటయకు తీసుకొచ్చాం.విజేతలుగా నిలిచిన అసిఫ్, రాజులకే కాదు…డాన్స్ ఐకాన్ షోను మరచిపోలేని జ్ఞాపకంగా నిలబెట్టిన ఇతర కంటెస్టెంట్స్‌తో పాటు కొరియోగ్రాఫర్స్‌కి థాంక్స్.
’’