గణేష్ ఆచార్య. ఇటీవలి కాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
మొన్నటి వరకు పుష్ప సినిమాలో సమంత నటించిన ఊ అంటావా ఉహూ అంటావా అనే పాటకు కొరియోగ్రఫీ చేసి ఒకసారి హాట్ టాపిక్ గా మారిపోయాడు ఇక ఈ సినిమాలో ఎంతో రొమాంటిక్ గా కొరియోగ్రఫీ చేసాడు అంటు ప్రశంసలు కూడా అందుకున్నాడు గణేశ్ ఆచార్య. దీంతో ఇక ఎంతో మంది మెచ్చుకున్నారు.
కట్ చేస్తే గణేష్ ఆచార్య గురించి కొన్ని రోజుల్లోనే ఓ వార్తా సెన్సేషన్ సృష్టించింది.గణేష్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడు అంటు ఈ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఒక మహిళ ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.
ఈ క్రమంలోనే గణేష్ ఆచార్య మీద వివిధ సెక్షన్ల కింద దాదాపు ఐదు కేజీల వరకు నమోదు అయ్యాయని తెలుస్తోంది.గతంలో మీటు ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో కూడా గణేశ్ ఆచార్య పై పలువురు సెలబ్రిటీలు ఇలాంటి ఆరోపణలు చేశారు అనే విషయం తెలిసిందే.
ఇక ఇవన్నీ పక్కనపెడితే ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.అదే గణేష్ ఆచార్య తన కూతురు సౌందర్య తో డాన్సులు చేయడం.కూతురుతో డాన్సులు చేస్తే తప్పేంటి అని అంటారా.డాన్సులు చేయడం ఓకే కానీ చేసే పాట ఏంటి.
చేస్తున్న స్టెప్పులు ఏంటి.ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.సాధారణంగా కూతురితో కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేస్తే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.ఒక రొమాంటిక్ పాట పై తండ్రి కూతురు డాన్స్ చేస్తే చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది.ఇప్పుడు గణేష్ ఆచార్య తన కూతురు సౌందర్య తో కలిసి చేసిన ఒక రొమాంటిక్ డాన్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇది చూసిన నెటిజన్లు కూతురుతో ఇలాంటి డాన్సులు ఏంటి బాబు అంటూ గట్టిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు.మరి కొంతమంది ప్రొఫెషన్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఎంతో ప్రొఫెషనాలిటీ అయినా కూడా సున్నితమైన బంధాల విషయంలో ఎప్పుడూ గీత దాటకూడదు అని ఎంతోమంది అంటున్నారు.ఇక ఇలాంటి ఒక పరిస్థితి ఇటీవలే టాలీవుడ్ లోను జరిగింది.శేఖర్ మాస్టర్ సైతం ఒక టీవీ ప్రోగ్రాం లో కూతురు తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసిన కూడా, ఆ పాట చూసాక కూతురు తో రొమాంటిక్ సాంగ్ ఏంటి అంటూ కామెంట్స్ చేసారు.మరి ఇలా డ్యాన్స్ మాస్టర్స్ రొమాంటిక్ సాంగ్స్ లో కూతుళ్లతో డ్యాన్స్ చేయడం పట్ల ఒకింత వ్యక్తిరేఖత కనిపిస్తున్న తరుణం లో ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో వేచి చూడాలి.







