దామిని( Singer Damini ).సింగర్ గా ఎన్నో సినిమాల్లో పాటలు పాడి తనకున్న స్టార్ డం తో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో పాల్గొంటుంది.
ఆటపరంగా కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్న దామిని వంటింట్లోనే ఎక్కువగా ఉంటుంది.పైగా సింగర్ గా ఉన్న దామిని ఒక్కసారి కూడా తన గొంతును బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు వినిపించడం అయితే జరగడం లేదు.
ఆడుతున్న ప్రతి టాస్క్ లోనూ ఫ్లాప్ అవుతుంది.ఫిసికల్గా ఎలాంటి ఆక్టివిటీ చేయలేకపోతోంది.
పోనీ మైండ్ గేమ్ అయినా ఆ ప్రాపర్ గా జరుగుతుందా అంటే అది లేదు.ఆమె ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ముందుకు వెళుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో ముందుకు వెళ్లాలి అంటే తన తోటి వారిని తట్టుకొని ముందుకు వెళ్లగలగాలి.ఆటతోను, ఫిజికల్ ఆక్టివిటీతోను, మైండ్ గేమ్ తోను అన్ని విధాల ప్రేక్షకుల మెప్పుతో పాటు బిగ్ బాస్( Bigg Boss ) ని కూడా ప్రసన్నం చేసుకోగలగాలి.కానీ దామిని విషయంలో ఇవేమీ జరగడం లేదు.ఆమె చాలా డల్ గా కనిపిస్తుంది పైగా తోటి కంటెస్టెంట్ ని డీల్ చేయడంలో ఫెయిల్ అయి చివరికి తానే ఏడుస్తుంది.
ఇవన్నీ పక్కన పెడితే ఆమె బూతులు మాత్రం దారుణంగా ఉంటున్నాయి అవి ప్రేక్షకులు వింటే బాగోదని బిగ్ బాస్ చివరికి వాటిని బీప్ చేస్తున్నాడు.మాటిమాటికి ఒక ‘F’ వర్డ్ వాడుతోంది.
ఇది దమినికి ఊతపదంగా మారినట్టుగా ఉంది.
ఒక సింగర్ గా నలుగురు మెచ్చుకునే విధంగా మెరగాల్సిన దామిని ఇలా బూతులు మాట్లాడుతూ ఉంటే తన తోటి కంటెస్టెంట్స్ ఇబ్బంది పడుతున్నారు.చూసే ప్రేక్షకులకు కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఆమె ఆట ఆడటం ఆడక పోవడం ఆమె ఇష్టం.
ఒకవేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.కానీ ఇలాంటి బూతులు వాడటం వల్ల వారిపై ఒక ప్రభావం ఉంటుంది.
ఆమెను జనాలు చూసే దృష్టి మారుతుంది.ఇది మార్చుకుంటే తప్ప వారి క్యారెక్టర్ ని జనాలు ఒక అంచనాకు రాకుండా ఉంటారు.