ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు రెండో పెళ్లికి సంబంధించిన వార్తల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన దల్జీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
దల్జీత్ కౌర్ రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మనోజ్ రెండో పెళ్లి( Manchu Manoj ) చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
పవిత్ర లోకేశ్ నరేష్( Pavitra Lokesh Naresh ) పెళ్లి గురించి కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పవిత్ర నరేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ భాగంగా దిగిన ఫోటోలు అని వార్తలు వినిపించాయి.

దల్జీత్ కౌర్(Daljeet Kaur ) విషయానికి వస్తే హిందీ సీరియళ్లలో మంచి పాత్రల్లో నటించి ఆమె మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సీరియళ్ల ద్వారా హైయెస్ట్ రెమ్యునరేషన్ ను సొంతం చేసుకున్న నటీమణులలో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం.ఈ నటి మొదటి భర్త పేరు షాలిన్ భానోత్( Shalin Bhanot ) కాగా అభిప్రాయ బేధాల వల్ల వీళ్లిద్దరూ విడిపోవడం జరిగింది.దల్జీత్ కౌర్ షాలిన్ భానోత్ లకు ఒక కొడుకు ఉన్నారు.
మొదటి భర్తతో విడిపోయిన తర్వాత కొంతకాలం ఒంటరిగా జీవితం సాగించిన ఈ నటి తాజాగా నిఖిల్ పటేల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

దల్జీత్ కౌర్ నిఖిల్ పటేల్( Nikhil Patel ) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ప్రముఖ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు సైతం ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ కొత్త జంట అన్యోన్యంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దుబాయ్ లో జరిగిన ఒక పార్టీలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.







