నాని( Nani ) హీరోగా నటించిన దసరా సినిమా( Dasara movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా ను భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్న కారణంగా అన్ని చోట్ల కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.మొదట తెలుగు లో మినహా ఇతర భాషల్లో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.
కానీ నాని చాలా రకాలుగా ప్రయత్నించి సినిమాను ప్రమోషన్ చేశాడు.భారీ ఎత్తున ఖర్చు చేసి ఉత్తర భారతంలో మంచి పబ్లిసిటీ చేయడం జరిగింది.

ముఖ్యంగా నాని ఆ మధ్య ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా 2023 సంవత్సరంలో నిలిచి పోయే సినిమా అవుతుంది.కేజీఎఫ్.ఆర్ఆర్ఆర్.కాంతార సినిమాలు ఎలా అయితే నిలిచి పోయాయో ఆ సినిమా ల రేంజ్ లో ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకోబోతున్నారు అని నాని పేర్కొన్నాడు.
ఆ ఒక్క మాటతో నాని కచ్చితంగా సినిమా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు అనడంలో సందేహం లేదు.నాని మరియు కీర్తి సురేష్( Keerthy suresh ) జంటగా నటించిన ఈ సినిమా కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

హీరోగా నాని కి ఇది అత్యంత కీలకమైన మూవీ అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ తో నాని కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ వంద కోట్ల రూపాయలకు పైగా చేసినట్లుగా తెలుస్తోంది.నాని కెరీర్ లో అత్యధికంగా వసూళ్లు రాబట్టబోతున్న సినిమాగా ఇది నిలుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.







