అహింస.. పక్కా తేజా మార్క్ మూవీ..!

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు అభిరాం తన మొదటి సినిమా తేజ డైరక్షన్ లో చేస్తున్నాడు.తేజ డైరక్షన్ లో వస్తున్న అహింస సినిమా లో అభిరాం, గీతిక జంటగా నటిస్తున్నారు.

 Daggubati Abhiram Teja Ahimsa Teaser Released, Abhiram Ahimsa,ahimsa, Ahimsa Tea-TeluguStop.com

రీసెంట్ గా నీతోనే నీతోనే సాంగ్ తో సినిమాపై బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తే సినిమా పక్కా తేజా మార్క్ మూవీగా వస్తుందని అనిపిస్తుంది.

తేజ సినిమాలో లవ్ స్టోరీ కామన్.పేద, ధనిక వర్గాల ఫైటింగ్ కూడా కామన్.

ఫైనల్ గా ప్రేమని గెలిపించుకోవడం కోసం లీడ్ పెయిర్ ఏం చేశారు అన్నదే సినిమా కథ.

Telugu Abhiram Ahimsa, Ahimsa, Ahimsa Teaser, Anandi, Geethika, Kiran, Tollywood

దాదాపు తేజా సినిమాలన్ని ఇదే కథలతో వస్తాయి.అహింస సినిమా టీజర్ చూస్తే రొటీన్ హిట్ ఫార్ములానే అనిపిస్తుంది.మరి కొత్తగా ఏమైనా ట్రై చేశాడా అన్నది మాత్రం సినిమా వస్తేనే తెలుస్తుంది.

అభిరాం లోని నటుడిని వెలికితీసే ప్రయత్నంలో తేజ కొంతమేరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.నీతోనే నీతోనే సాంగ్ ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ ఏర్పరచింది.మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని తేజ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube