తండ్రిగా ప్రమోట్ అయిన దగ్గుబాటి హీరో... పండంటి ఆడబిడ్డకు జన్మ!

దగ్గుబాటి ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి.ఇటీవల వరుసగా ఏదో ఒక వేడుకలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతున్నారు.

ఇటీవల నాగచైతన్య పెళ్లి వేడుకలు దగ్గుబాటి కుటుంబ సభ్యులందరూ కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ ఇద్దరు తాతయ్యలుగా ప్రమోట్ అయ్యారని తెలుస్తోంది.

దగ్గుబాటి సురేష్ బాబు (Suresh Babu) చిన్న కుమారుడైన హీరో అభిరామ్(Abhi Ram) గురించి అందరికీ సుపరిచితమే.

అభిరామ్ తేజ దర్శకత్వంలో తెరికెక్కిన అహింస (Ahimsa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ తేజ అలాగే అభిరామ్ ఇద్దరు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

Advertisement

అయితే గత ఏడాది ఈయన తమ సమీప బంధువుల అమ్మాయి అయినటువంటి ప్రత్యూషను(Prathyusha)  శ్రీలంకలో వివాహం చేసుకున్నారు.ఇలా శ్రీలంకలో వివాహం అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ వేడుకను కూడా నిర్వహించారు.

ఇలా గత ఏడాది పెళ్లి చేసుకున్న అభిరామ్ ప్రత్యూష దంపతులు తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది.ఇలా దగ్గుబాటి కుటుంబంలోకి మరో తరం వారసురాలు అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు అలాగే దగ్గుబాటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక అభిరామ్ వయసులో రానా కంటే చిన్నవాడు అయినప్పటికీ ఈయనే ముందు తండ్రిగా ప్రమోట్ అయ్యారు.

ఇక రానా పెదనాన్నగా ప్రమోట్ అయ్యారు.ఇక రానా దాదాపు మూడు సంవత్సరాలు క్రిందట వివాహం చేసుకున్న ఇంకా పిల్లల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాలి కానీ అభిరామ్ మాత్రం ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

సంక్రాంతి సినిమాలకు షాక్ ఇస్తున్న రేవంత్ రెడ్డి...
Advertisement

తాజా వార్తలు