ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న డాకు మహారాజ్.. మూవీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

బాలయ్య నటించిన డాకు మహారాజ్( Daku Maharaj ) క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు బాబీ ( Director Bobby )ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

సాధారణంగా పండగల సమయంలో దర్శకుడు బాబీ సినిమాలు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి.డాకు మహారాజ్ సినిమా కూడా అదే విధంగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం కొసమెరుపు.

డాకు మహారాజ్ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.నెట్ ఫ్లిక్స్ ( Netflix )ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది.

నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.సితార నిర్మాతలు స్పందిస్తే ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

Advertisement

సితార నిర్మాతలు( Producers of Sitara ) తమ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు.తమ సినిమాల హక్కులను ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ కు విక్రయిస్తున్నారు.డాకు మహారాజ్ మూవీ నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.

డాకు మహారాజ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుండగా ఈ సినిమా ఓటీటీలో సైతం హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.డాకు మహారాజ్ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేస్తుంది.డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య లుక్స్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.

డాకు మహారాజ్ సినిమా ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.బాలయ్యకు బాక్సాఫీస్ వద్ద కూడా పరిస్థితులు అనుకూలిస్తూ ఉండటంతో ఈ స్టార్ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు చేరుతున్నాయి.

పుష్ప కా బాప్.... చరణ్ సినిమా విడుదల వేళ అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు