సాధారణంగా సినిమాలలో హీరోయిన్స్ అందంగా కనిపించడం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.హీరోయిన్ల అందం సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలుస్తుంది.
తమ గ్లామర్ గాని, ఇమేజ్ గాని ఏమాత్రం తగ్గినట్లు అనిపించినా ఆ పాత్రలో నటించడానికి ఇష్టపడరు కొందరు హీరోయిన్లు.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్లు మాత్రం పాత్ర కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం అంటూ డీ గ్లామరస్ క్యారెక్టర్లు చేస్తున్నారు.
అలా రిస్క్ చేసిన హీరోయిన్లు ఎవరో ఓసారి చూద్దాం.హీరో ధనుష్ నటించిన స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం రాయన్.సందీప్ కిషన్, కాళిదాసు, జయరాం, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు.అయితే ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దుషారా విజయన్,అపర్ణ బాలమురళి( Varalakshmi Sarath Kumar, Dushara Vijayan, Aparna Balamurali ) ముగ్గురు కూడా ఫుల్ డీ గ్లామరస్ రోల్స్ లో కనిపించబోతున్నారు.
డీ గ్లామరస్ లుక్ తో ఆల్రెడీ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి.అలాగే తంగలాన్ సినిమా( Tangalan movie ) కోసం హీరోయిన్లు మాళవిక మోహన్, పార్వతి( Malvika Mohan, Parvathi ) పూర్తిగా డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ పాత్ర చేయడం నాకు సవాల్ గా అనిపించింది అంటూ మాళవిక మోహన్ ఒక సందర్భంలో చెప్పుకున్నారు కూడా.ఇక కల్కి సినిమా కోసం హీరోయిన్ దిశాపఠాని కూడా కొన్ని సీన్స్ లో డీ గ్లామరస్ గా కనిపిస్తారని సమాచారం.
ఇక దేవర సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) అని అందరికీ తెలిసినదే.ఈ అందాల ముద్దుగుమ్మ ఈ సినిమా కోసం పూర్తి డీ గ్లామరస్ గా కనిపిస్తున్నారు.ఈ సినిమాలో ఈమె పాత్ర పేరు తంగమ్.ఒక మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగమ్ అనే యువతి పాత్రలో కనిపించే జాన్వీ కపూర్ చాలా సీన్స్ లో డీ గ్లామరస్ గా కనిపిస్తారట.
నిజానికి ఆమెకి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఇలాంటి ఒక డీ గ్లామరస్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.