అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు.ఈ సైక్లోథాన్ పోటీలు 25 కిలో మీటర్ల పుల్ రేస్, 15 కిలో మీటర్ల ఫన్ రేస్, 5 కిలో మీటర్ల కిడ్స్ రేస్ కు సంబందించి మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
ఈ సైక్లోథాన్ పోటీలకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్, అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రా, బాలీవుడ్ నటుడు నకుల్ రోషన్, టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ హజరయ్యారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రారంభమైన 25 కిలో మీటర్ల సైక్లింగ్ పోటీలను మంత్రి దయాకర్ రావు, సీపీ తరుణ్ జోషి ప్రారంభించారు.
ఆనంతరం స్లైకింగ్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంత్రి దయాకర్ రావు సైకిల్ తొక్కూతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంత్రితో పాటు పలువురు ప్రముఖలు సైకిల్ పోటీల్లో పాల్గొన్నారు.అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రా సైకిల్ తొక్కుతూ పలు విన్యాసాలు చేశారు.
ఈ సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగంతో అక్రమ రవాణా పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన ఆలోచనలకై సైక్లింగ్ వ్యాయామం ఏవిధంగా దోహదపడుతుందో యువతను ఆలోచింపజేసే రీతిలో అవగాహన కల్పించడం జరుగుతుందని సీపీ తెలిపారు.
మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహనతో పాటు సైకిల్ తోక్కడం వలన శారీరక వ్యాయామం చేసినట్లు అవుతుందని చెప్పారు.
మాదకద్రవ్యాల నియంత్రణకై పోలీసులు సాగిస్తున్న పోరాటంకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మంత్రి దయాకర్ రావు అభినందించారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సైక్లిస్ట్ లకు నగదు పురస్కారలు అందజేశారు….