భారత సంతతి వ్యక్తికి అత్యున్నత పదవి

దేశ విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు తమ ప్రతిభల ఆదరంగా అక్కడ ఎంతో పేరుగాంచిన సంస్థలలో ఉన్నతమైన పదవులని అధిరోహిస్తూ ఉంటారు.

ఎంతో అత్యున్నతమైన ఎత్తులని చేరుకుంటూ ఉంటారు.

అయితే ఈ క్రమంలో వారు వారు పుట్టిన దేశానికే గర్వకారణం అవుతారు.ఈ విషయంలో భారతీయులు ముందు వరుసలో ఉంటారు.

ఎంతో మంది భారత ఎన్నారైలు విదేశాలలో తమ సత్తా చాటిన సందర్భాలు అనేకం.అయితే

తాజాగా అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సేవల కంపెనీ యాక్సెంచర్‌ తమ సెక్యూరిటీ విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన సైబర్‌ భద్రత నిపుణుడు అనూప్‌ ఘోశ్‌ను నియమించింది.తమ సెక్యూరిటీ సేవల వ్యాపారంలో వృద్ధికి ఆయన నియామకం తోడ్పననున్నట్లు కంపెనీ వెల్లడించింది.సైబర్‌ సెక్యూరిటీ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదవుతున్న సమయంలో యాక్సెంచర్‌లో చేరడం చాలా ఆనందంగా ఉందని అనూప్‌ తెలిపారు.

Advertisement

అనూప్ క్కి సైబర్‌ సెక్యూరిటీ రంగంలో దీర్ఘకాలం పాటు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.ఆయన వర్జీనియా కేంద్రంగా మెషీన్‌ లెర్నింగ్‌ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఇన్‌విన్సియాను ఆయన ప్రారంభించారు.2017 మార్చిలో దాన్ని సోఫోస్‌కు విక్రయించే వరకు ఇన్‌విన్సియా.సీఈఓగా సైతం పనిచేశారు.

అంతకంటే ముందు డిఫెన్స్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఏజెన్సీలో ప్రోగామ్‌ మేనేజర్‌గా సైతం పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు