సైబర్ నేరగాళ్లు మరో దారిలో డబ్బులు కొట్టేస్తున్నారు... స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌తో జర జాగ్రత్త!

రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతుందని సంబరపడాలో, బాధపడాలో తెలియడంలేదు.సైబర్ నేరగాళ్లు నానాటికీ పేట్రేగిపోతున్నారు.

టెక్నాలజీని అలుసుగా తీసుకొని సులువుగా దోచేస్తున్నారు.ఎప్పటికప్పుడు కొత్తదారులు వేసుకుంటూ జనాలను ఇట్టే బురిడీ కొట్టిస్తున్నారు.

ఈ క్రమంలో నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు అందరూ తేలికగా మోసపోతున్నారు.స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ పేరుతో గాలం వేసి, అందినకాడికి డబ్బు లాగేస్తున్నారు.

సాయం చేస్తామని నమ్మించి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి, విలువైన సమాచారాన్ని దొంగిలించి, తర్వాత తమ ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకుంటున్నారు.తాజాగా ఓ కథను తీసుకుంటే, విజయవాడ పటమటలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు, ఓ మెసేజ్ వచ్చింది.

Advertisement
Cyber Fraudsters Looted Money Using Screen Sharing Apps In Vijayawada Details, C

సిమ్‌కు సంబంధించి పత్రాల పరిశీలన ఇంకా పూర్తి కాలేదని, త్వరగా ముగించాలని, లేకుంటే 24 గంటల్లో సిమ్‌ పనిచేయడం ఆగిపోతుందని దాని సారాంశం.మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, BSNL కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.

కేవైసీ డాక్యుమెంట్‌ పెండింగ్‌ ఉందని, పూర్తి చేయడానికి తాను సాయం చేస్తానని, ఇందుకు గాను "ఎనీ డెస్క్‌" యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు.అతడు చెప్పినట్లే ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

Cyber Fraudsters Looted Money Using Screen Sharing Apps In Vijayawada Details, C

సైబర్ దుండగుడు సూచించిన విధంగా బాధితుడు SBI ఖాతా నుంచి రూ.10 ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీ నిర్వహించాడు.అయితే ఆ డబ్బు జమకాలేదని చెప్పడంతో మళ్లీ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.10 బదిలీ చేశాడు.2 రోజుల తర్వాత బాధితుడికి ఫోన్‌ చేసి, మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పడంతో.బాధితుడు తూచా పాటించాడు.20 నిముషాల తర్వాత, నగదు లావాదేవీలు జరిగినట్లు చాలా SMS​లు అతగాడికి రావడంతో విషయం గ్రహించి ఖంగు తున్నాడు.మొత్తం 3 లక్షలకుపైగా లూటీ చేసినట్టు సమాచారం.

తాజాగా సైబర్ నేరగాళ్లు మొబైల్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో సాఫ్ట్‌వేర్, ఇతర సమస్యల పరిష్కారం కోసం స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ వాడుకుంటున్నారు జాగ్రత్త!.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు